అమరావతి కుంభకోణం: హైకోర్టు గాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే

సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది.. అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లోని విషయాలను మీడియాకు ఇవ్వకుండా పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే […]

Written By: NARESH, Updated On : November 26, 2020 3:03 pm
Follow us on

సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది.. అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లోని విషయాలను మీడియాకు ఇవ్వకుండా పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. ఇదిప్పుడు సంచలనంగా మారింది. ఈ పరిణామంతో సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు భారీ ఊరట లభించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో ఏపీలోని జగన్ సర్కార్ వాదనకు బలం చేకూర్చినట్టైంది.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. సులభంగా రూ.5 లక్షలు లోన్ పొందే ఛాన్స్..?

ఏపీ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ ను సవాలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక సెలవు పిటిషన్‌ ను సుప్రీంకోర్టు దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణ జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. అప్పటి దాకా ఈ కేసును ఫైనల్ డిసైడ్ చేయొద్దని హైకోర్టును ఆదేశించింది.

జగన్ సర్కార్ తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు. తనపై చర్యలు తీసుకోవద్దని దమ్మాలపాటి కోర్టును ఆశ్రయిస్తే 13 మందికి వర్తింపచేశారని.. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా పాస్ చేస్తారని వాదించారు. అమరావతిలో మేజర్ స్కాం జరిగిందని.. దీనిపై దర్యాప్తు జరగాలని కోరారు. బినామీల ద్వారా భూములు కొనుగోలు చేశారన్నారు. అమరావతిలో భూ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సిట్ పై హైకోర్టు స్టే విధించిందన్నారు.. దీంతో సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని కోర్టుకు తెలిపారు. నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు చేయొద్దా.. అడ్వకేట్ జనరల్‌గా పని చేసినంత మాత్రాన ప్రతీకారం పేరుతో దర్యాప్తు జరగొద్దని అంటారా.. దర్యాప్తు వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు, ఏది జరగకూడదా అని రాజీవ్ సూటిగా ప్రశ్నించారు. అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు చేస్తే ఇబ్బంది ఏంటని రాజీవ్ ప్రశ్నించారు. మధ్యంతర ఆదేశాలు ఎలా ఇస్తారని.. మీడియాపై గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం సరికాదన్నారు.

Also Read: టీడీపీకి కొరకరాని కొయ్యలా బీజేపీ

సహారా కేసులో మీడియాపై గ్యాగ్ ఆర్డర్ విషయంలో నిర్దిష్ట సూత్రాలు ఉన్నాయని.. ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్.. రాజకీయ దురుద్దేశంతో సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ లిటిగేషన్ వేస్తున్నారన్నారని రాజీవ్ వాదించారు.

ఇటు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, ముకుల్ రోహత్గి వాదనలు వినిపంచారు. గత ప్రభుత్వంలో శ్రీనివాస్ ఏజీగా పని చేశారని.. అందుకే టార్గెట్ చేశారన్నారు. రాజధాని అనేది రహస్యం కాదు, అది అందరికీ తెలుసు.. రాజధానిలో భూములు కొనవద్దని ఎలా అంటారని ప్రశ్నించారు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ వేకెట్ చేయమని అడగాలని సూచించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్