https://oktelugu.com/

మోనాల్ ఏమి చేస్తోందో ఆమెకైనా తెలుసా ?

మొత్తానికి బిగ్‌బాస్ హౌస్ లో ‘మోనాల్’ ఓవర్ ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది. పైగా అటు అభిజిత్, అఖిల్‌ లతో చెరో ట్రాక్ నడుపుతూ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెడుతున్నా.. కుర్రాళ్లను మాత్రం బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. అసలు హౌస్ లో మోనాల్ కథలే రోజురోజుకూ వేరేలా సాగిపోతున్నాయి. ముందు ఒకరి మీద తెగ ఇష్టం చూపిస్తోంది, అంతలోనే ఇంకొకరితో తెగ క్లోజ్‌ గా మూవ్ అవుతొంది. అసలు ఏం జరుగుతుంది.. మోనాల్ […]

Written By:
  • admin
  • , Updated On : October 15, 2020 / 03:35 PM IST
    Follow us on


    మొత్తానికి బిగ్‌బాస్ హౌస్ లో ‘మోనాల్’ ఓవర్ ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది. పైగా అటు అభిజిత్, అఖిల్‌ లతో చెరో ట్రాక్ నడుపుతూ, ఫ్యామిలీ ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెడుతున్నా.. కుర్రాళ్లను మాత్రం బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది. అసలు హౌస్ లో మోనాల్ కథలే రోజురోజుకూ వేరేలా సాగిపోతున్నాయి. ముందు ఒకరి మీద తెగ ఇష్టం చూపిస్తోంది, అంతలోనే ఇంకొకరితో తెగ క్లోజ్‌ గా మూవ్ అవుతొంది. అసలు ఏం జరుగుతుంది.. మోనాల్ మనసులో ఏముందో అర్ధం కాక అభిజిత్, అఖిల్‌ ఇద్దరూ ఆ హాట్ బ్యూటీ వెంట పడుతూ వాళ్ళల్లో వాళ్ళే తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. దీనికితోడు మోనాల్ చేష్టలు కూడా అభిజిత్ అఖిల్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి.

    Also Read: బిగ్‌బాస్‌ ఓటింగ్‌పై అనుమానాలు.? సంచలన ఆరోపణ!

    అసలు మోనాల్ వ్యవహారం బిగ్ బాస్ కైనా అర్ధం అవుతుందా..? పగలంతా ఒకరితో సరదాగా ఉంటుంది.. రాత్రి అవ్వగానే మరొకరి చెంతకు చేరుతుంది. పైగా ఒక్క అఖిల్, అభిజిత్ లతో తప్పా మిగతా కంటెస్టెంట్లతో కూడా అంతగా కలిసిపోయినట్టుగా కూడా కనిపించట్లేదు. మరి మోనాల్ అలవాటులో పొరపాటుగా ఇలా మూవ్ అవుతుందా..? లేక, రేటింగ్ కోసం బిగ్ బాస్ నే ఇలా చేయమ్మా అంటూ ఆమెను గైడ్ చేస్తున్నాడా..? లేకపోతే, కుటుంబంతో కలిసి చూసే షోలో ఏమిటి ఎద అందాల ప్రదర్శన..? ఏది ఏమైనా ఈ సీజన్ లో మోనాల్ సృష్టించిన హాట్ సెన్సేషన్ ఇంతవరకూ ఏ అందాల భామ సృష్టించలేకపోయింది. ఇక నిన్నటి టాస్క్‌లో అభిజిత్, మోనాల్ ఒక టీంలో ఉండగా.. అఖిల్‌ ది వేరే టీం.

    Also Read: ఆవిరైన ఉత్సాహం.. థియేటర్లు ఓపెన్ చేస్తే నష్టపోవాల్సిందేనా?

    ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ లో భాగంగా అఖిల్‌ గార్గెన్ ఏరియాలోని కుర్చిలో కూర్చున్నాడు. బిగ్ బాస్ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎవరేం చేసినా అఖిల్ అలాగే కూర్చుని ఉండాలనేది షరతు. మరోవైపు అభిజిత్, అరియానా, అవినాష్, మెహబూబ్, లాస్య, మోనాల్ ఇలా అందరూ బిగ్ బాస్ ఇచ్చిన కొన్ని ప్రాపర్టీస్‌తో అఖిల్‌ ను ఆ కుర్చీలోంచి లేచిపోయాలే చేయగలగాలి. దాంతో అవినాష్, మెహబూబ్, అభిజిత్ కలిసి అఖిల్‌ పై షాంపు, నీళ్లు, సబ్బు కలిపిన నీళ్లు పోస్తూ అఖిల్‌ ను లేపే ప్రయత్నం చేస్తుండగా.. అది చూసి భరించలేని మోనాల్ ఆ టాస్క్‌ కు భంగం కలిగించింది. దాంతో మెహబూబ్, అవినాష్, అభిజిత్ అందరూ కలిసి మోనాల్‌ పై సీరియస్ అయ్యారు. కనీసం మోనాల్ టాస్క్ వరకైనా బాధ్యతగా ఉండాలి కదా.. అసలు వేరే వేరే టీంలో ఉన్నప్పుడు అఖిల్ కి మోనాల్ ఇలా సపోర్ట్ చేయడమేంటో.. ఇంతకీ మోనాల్ ఏమి చేస్తోందో ఆమెకైనా తెలుసా ?