
పశుగణం ఒక దశకు వచ్చేసరికి నిరుపయోగ స్థితికి వస్తాయని, వాటివల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. పశువులు నిస్సహాయ స్థితికి రావడంతో రైతులకు అవి భారమవుతాయని తెలిపారు. రైతులపై పడే ఈ భారాన్ని తొలగించేందుకు ప్రభుత్వమే వాటిని స్వయంగా కొనుగోలు చేయాలని సూచించారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త గోవధ నిరోధక చట్టంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.