Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: "కోవా బన్" వలీకి అండ..అది నారా లోకేష్ అంటే..

Nara Lokesh: “కోవా బన్” వలీకి అండ..అది నారా లోకేష్ అంటే..

Nara Lokesh: కర్నూలు జిల్లా చెందిన కోవాబన్ వలీ.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా కనిపించాడు. అతడు అలా కనిపించడానికి ప్రధాన కారణం.. అతడు తయారుచేసిన కోవా బన్ ను మేడారంలో విక్రయిస్తుండగా.. కొంతమంది అదే పనిగా అతని వద్దకు వచ్చారు. యూ ట్యూబర్ల ముసుగులో ఇబ్బంది పెట్టారు. కోవాబన్ తినాల్సిందేనని పట్టు పట్టారు. దీంతో అతడు వారి ముందే కోవా బన్ తిన్నాడు. “అతడు తయారుచేసిన కోవా బన్ లో నాణ్యత లేదు. కనీసం బన్ […]

Nara Lokesh: కర్నూలు జిల్లా చెందిన కోవాబన్ వలీ.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా కనిపించాడు. అతడు అలా కనిపించడానికి ప్రధాన కారణం.. అతడు తయారుచేసిన కోవా బన్ ను మేడారంలో విక్రయిస్తుండగా.. కొంతమంది అదే పనిగా అతని వద్దకు వచ్చారు. యూ ట్యూబర్ల ముసుగులో ఇబ్బంది పెట్టారు. కోవాబన్ తినాల్సిందేనని పట్టు పట్టారు. దీంతో అతడు వారి ముందే కోవా బన్ తిన్నాడు.

“అతడు తయారుచేసిన కోవా బన్ లో నాణ్యత లేదు. కనీసం బన్ ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు. కోవా తయారీలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. ఆ బన్ చూస్తుంటే ఏదో విధంగా ఉంది. అందులో కలిపే కోవా కూడా విచిత్రంగా కనిపిస్తోంది. ఇటువంటి కోవా బన్ తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని” కొంతమంది యూట్యూబర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలో వలీ కి చాలామంది అండగా నిలిచారు. వలీ కి సంబంధించి విస్తృతమైన చర్చ జరిగిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో అతనికి చాలామంది అండగా నిలిచిన క్రమంలో.. ఈ విషయం ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టి కి వెళ్ళింది. దీంతో ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.. కర్నూలుకు చెందిన వలీ అనే చిరు వ్యాపారికి సంబంధించిన విషయం నాకు తెలిసింది. వలి రూపొందించిన కోవా బన్ తినాలని నాకు ఉంది. అతడు తయారుచేసిన కోవా బన్ తినడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. అతనిపై కొందరు ఆరోపణలు చేయడం నచ్చలేదు. అది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఐక్యతను దెబ్బతీసే విధంగా కొంతమంది ఇలా ప్రవర్తించడం సరికాదు. ఇటువంటి వాటికి సమాజంలో చోటు లేదు. వలికి అండగా ఉంటానని” లోకేష్ పేర్కొన్నారు.

లోకేష్ తన గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించడం.. తనను కలుస్తానని చెప్పడంతో వలి ఆనందంతో ఉన్నాడు. లోకేష్ వద్ద తన కష్టాలు చెప్పుకుంటానని.. తనకు అండగా నిలిచినందుకు లోకేష్ కు కృతజ్ఞతలని వలి పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper