
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ఈనెల 14న తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం బయల్దేరి పోలవరం వెళ్లనున్నారు. సోమవారం పోలవరం చేరుకుని అక్కడ క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ పనులను సీఎం జగన్ పరిశీలించనున్నారు. పోలవరం పనులను వేగవంతం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం జగన్ వెంట మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు.