Homeవింతలు-విశేషాలుThailand: కారు కోసం వాటిని అమ్మేశాడు.. అవి లేకుండా ఎలా బతుకుతావు భయ్యా!

Thailand: కారు కోసం వాటిని అమ్మేశాడు.. అవి లేకుండా ఎలా బతుకుతావు భయ్యా!

Thailand: వ్యసనం అనేది ఏడు ఊళ్ళ ప్రయాణం అంటుంటారు.. మద్యం తాగడం.. అమ్మాయిలతో గడపడం.. డబ్బును విపరీతంగా ఖర్చుపెట్టడం మాత్రమే కాదు.. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం కూడా ఒక వ్యసనమే. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే క్రమంలో చాలామంది వెనుక ముందు చూడరు. కొన్ని సందర్భాలలో అందిన కాడ మొత్తం అప్పులు తీసుకొస్తారు. విలువైన వస్తువులు సొంతం చేసుకుంటారు. ఆ తర్వాత అప్పులు తీర్చే మార్గం లేక తలలు పట్టుకుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన […]

Thailand: వ్యసనం అనేది ఏడు ఊళ్ళ ప్రయాణం అంటుంటారు.. మద్యం తాగడం.. అమ్మాయిలతో గడపడం.. డబ్బును విపరీతంగా ఖర్చుపెట్టడం మాత్రమే కాదు.. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం కూడా ఒక వ్యసనమే.

ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే క్రమంలో చాలామంది వెనుక ముందు చూడరు. కొన్ని సందర్భాలలో అందిన కాడ మొత్తం అప్పులు తీసుకొస్తారు. విలువైన వస్తువులు సొంతం చేసుకుంటారు. ఆ తర్వాత అప్పులు తీర్చే మార్గం లేక తలలు పట్టుకుంటారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో కొన్ని సంఘటనలు ఆశ్చర్యకరంగా.. మరి కొన్ని సంఘటనలు వింతగా ఉంటున్నాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.

థాయిలాండ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కార్లు కొనుగోలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇటీవల అతడు ఒక వాహనాన్ని 1 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. దానిని అద్భుతంగా కష్టమైజ్ చేశాడు.

ఆవాహనాన్ని కష్టమైజ్ చేయడానికి 1.7 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు పెట్టాడు. అయితే అప్పటికే అతడు తన స్తోమతకు మించి ఖర్చు చేశాడు. వాహనాన్ని కష్టమైజ్ చేయడానికి భారీగా డబ్బు ఖర్చుపెట్టిన నేపథ్యంలో.. అప్పులు తెచ్చినచోట తిరిగి ఇవ్వడం కష్టంగా మారింది. దీంతో అప్పులు ఇచ్చినవారు అతడి ఇంటి మీదకు వచ్చారు.

అప్పులు తీర్చే మార్గం తెలియక అతడు తన ప్రైవేట్ పార్ట్స్ త్యాగం చేశాడు. తన లైంగిక అవయవాలు కీలకమైన వాటిని డొనేట్ చేశాడు. తద్వారా వచ్చిన డబ్బులను అప్పులు తీర్చాడు.

దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. థాయిలాండ్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి 2.7 మిలియన్ డాలర్ల ఖర్చుతో తన కారును మాడిఫై చేశాడని.. దానికోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టాడని.. అలా డబ్బులు ఖర్చు పెట్టడానికి తన ప్రైవేట్ పాఠశాల త్యాగం చేశాడని వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఈ కథనం నిజం కాదని.. ఎవరైనా సరే ప్రైవేట్ పార్ట్స్ త్యాగం చేయబోరని నెటిజెన్లు అంటున్నారు. ఇలా త్యాగం చేయడం వల్ల భవిష్యత్తు కాలంలో అతడు వివాహానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని.. పిల్లలను కనే అవకాశం కూడా ఉండదని.. అలాంటప్పుడు అతడు ప్రైవేట్ పార్ట్స్ త్యాగం చేసి కారును మాడిఫై చేయాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి ఫేక్ కథనాలను స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by C/o.Automobile (@cofautomobile)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper