
అంతకుముందు పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ పెరగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడ్డాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేలకు పైగా పెరిగింది. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం రూ.200 పెరిగి రూ.46,100కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 కి పెరిగి రూ.50,290గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి రూ.200 పెరిగి రూ.67,500కి పెరిగింది. ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.