https://oktelugu.com/

సీనియర్ నటి జయచిత్ర ఇంట్లో విషాదం

అలనాటి నటి జయచిత్ర నివాసంలో విషాదం నెలకొంది. ఆమె భర్త దర్శకుడు, నిర్మాత అయిన గణేశ్ గుండెపోటుతో మరణించారు. ఆయన మ్రుతి పై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గణేశ్ భౌతిక కాయాన్ని చెన్నైలోని పోయేస్ గార్డెన్ ఉంచారు. దీంతో అభిమానులు ఆయనను చివరిసారిగా చూసేందుకు తరలివస్తున్నారు. గణేశ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. 1983లో జయచిత్ర, గణేశ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు అమ్రేష్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. కాగా జయచిత్ర తమిళ, తెలుగు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 5, 2020 10:46 am
    Follow us on

    అలనాటి నటి జయచిత్ర నివాసంలో విషాదం నెలకొంది. ఆమె భర్త దర్శకుడు, నిర్మాత అయిన గణేశ్ గుండెపోటుతో మరణించారు. ఆయన మ్రుతి పై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గణేశ్ భౌతిక కాయాన్ని చెన్నైలోని పోయేస్ గార్డెన్ ఉంచారు. దీంతో అభిమానులు ఆయనను చివరిసారిగా చూసేందుకు తరలివస్తున్నారు. గణేశ్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. 1983లో జయచిత్ర, గణేశ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు అమ్రేష్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు. కాగా జయచిత్ర తమిళ, తెలుగు సినిమాల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు.