
మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో నెల రోజులుగా రైతుల నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా రైతులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులు ఒక పక్క కేంద్రం మరోపక్కా ఎవరూ మెట్టు దిగడం లేదు. రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. చర్చలకు రావాలని కేంద్రం పదే పదే విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆహ్వానంపై శనివారం రైతు సంఘాలు స్పందించాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరుపుతామని సంయుక్త్ కిసాన్ మోర్చా నేతలు తెలిపారు.