పీసీసీ రేసులో పవన్ కల్యాణ్.. సంచలన కామెంట్స్ చేసిన వీహెచ్..!

తెలంగాణలో పీసీసీ కోసం నేతల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. రేవంత్ వర్గం వర్సెస్ వ్యతిరేకం అన్నట్లుగా మాటలతూటలు పేలుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి.. వీహెచ్ లు తొలి నుంచి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని బహిరంగంగానే కోరుతున్నారు. Also Read: మద్యం పోయలేదని స్నేహితుడిని చంపేశాడు.. ఎక్కడంటే..? ఈక్రమంలోనే వీహెచ్ హన్మంతరావు.. జగ్గారెడ్డిలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. అంతేకాకుండా మీడియా ముఖంగా అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు హిటెక్కాయి. కాంగ్రెస్ రాష్ట్ర […]

Written By: Neelambaram, Updated On : December 26, 2020 8:23 pm
Follow us on

తెలంగాణలో పీసీసీ కోసం నేతల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. రేవంత్ వర్గం వర్సెస్ వ్యతిరేకం అన్నట్లుగా మాటలతూటలు పేలుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి.. వీహెచ్ లు తొలి నుంచి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వొద్దని బహిరంగంగానే కోరుతున్నారు.

Also Read: మద్యం పోయలేదని స్నేహితుడిని చంపేశాడు.. ఎక్కడంటే..?

ఈక్రమంలోనే వీహెచ్ హన్మంతరావు.. జగ్గారెడ్డిలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. అంతేకాకుండా మీడియా ముఖంగా అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు హిటెక్కాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ పై సైతం వీహెచ్ విమర్శలు చేసిన సంగతి తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయితే మరోసారి వీహెచ్ పీసీసీపై సంచలన కామెంట్స్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

గుంటూరు జిల్లా దొండపాడులో శనివారం వంగవీటి రంగా విగ్రహాన్ని వీహెచ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ బీసీలకు పీసీసీ చీఫ్‌ ఇవ్వాలని అడిగినందుకు ఫోన్లుచేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు.

Also Read: కేంద్రంతో చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమే..!

నాడు వంగవీటి రంగా సీఎం అవుతాడనే కొందరు కుట్రపూరితంగా హత్య చేశారని ఆరోపించారు. ఏపీలో 27శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. మూడు శాతం ఉన్న సామాజిక వర్గం కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.

వంగవీటి రంగా తర్వాత ఏపీలో పవన్‌కల్యాణ్‌కు మంచి వేవ్ ఉందని హన్మంతరావు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కాంగ్రెస్ లో చేరితే పీసీసీ ఇప్పిస్తానంటూ ప్రకటించారు. వీహెచ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై జనసేన నేతలు ఎలా రియాక్టవుతారో వేచిచూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్