ప్రముఖ మలయాళ కవి సుగతకుమారి బుధవారం మరణించారు. గత వారం రోజుల కిందట ఆమెకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే న్యమోనియా కూడా ఉండడంతో ఆమె శరీరం చికిత్సకు సహకరించలేదని తిరువనంతపురం మెడికల్ కళాశాల వైద్యులు పేర్కొన్నారు. సుగత కుమారి మలయాళ సాహిత్యంపై పట్టు సాధించారు. ఇందుకు ఆమెను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే పర్యావరణ విధ్వాంసానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చేశారు. 80వ దశకంలో ఓ జలవిద్యుత్ ప్రాజక్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. కాగా సుగతకుమారి మరణంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.