మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి మోహన్ యాదవ్ ఫై ఎన్నికలు ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28 రాష్ట్రాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘిస్తూ మంత్రి మోహన్ అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం మంత్రికి షోకాజ్ నోటీసు పంపించింది. అయితే మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందున ఆయనపై ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఆయన శనివారం నుంచి ఎక్కడా సభలు, సమావేశాలు, రోడ్‌షోల్లో పాల్గొనరాదని ఆదేశించింది.