https://oktelugu.com/

పవన్ ను ఢీకొట్టబోయేవాడు ఇంకా దొరకలేదా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజ్, హైప్ వేరే లెవల్లో ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా మిస్ ఫైర్ అయిపోతుంది. అదే అన్నీ సరిగ్గా కుదిరితే బ్రహ్మాండంగా వర్కవుట్ అయి లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పవన్ సినిమా అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ పవన్ తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను రీమేక్ చేయనుంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ […]

Written By:
  • admin
  • , Updated On : October 30, 2020 / 07:49 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజ్, హైప్ వేరే లెవల్లో ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా సినిమా మిస్ ఫైర్ అయిపోతుంది. అదే అన్నీ సరిగ్గా కుదిరితే బ్రహ్మాండంగా వర్కవుట్ అయి లాభాలను తెచ్చిపెడుతుంది. అందుకే నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పవన్ సినిమా అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ పవన్ తో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను రీమేక్ చేయనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఈ సినిమా కోసం పవన్ కేవలం 30 రోజుల్ కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడు. అంటే ఆయన డేట్స్ మేరకే సినిమాలో మిగతా నటీనటులు డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పవన్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ఇంకొక కీ రోల్ కోసం నటుడ్ని వెతుకుతున్నారు. మొదట ఇందులో రానా అయితే బాగుంటుందని అనుకున్నారు. ఆయనే ఫైనల్ అన్నారు.

    Also Read: మెగా హీరోల దండయాత్ర మొదలుకానుందా?

    కానీ ఏమైందో ఏమో కానీ ఆ స్థానంలో నితిన్ పేరు వినబడింది, ఇద్దరూ మంచి స్నేహితులు కాబట్టి అదే ఫైనల్ కాంబినేషన్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ పేరు తెరమీదికి వచ్చింది. ఈ కీ రోల్ కోసం ఆయన్ను సంప్రదిస్తున్నారట మేకర్స్. మరి ఈ ముగ్గురిలో పవన్ ను ఢీకొట్టబోయే వ్యక్తిగా ఎవరు ఫైనల్అ వుతారో చూడాలి.