టర్కీ, గ్రీసులో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రత నమోదు కావడంతో భవనాలు ఎక్కడికక్కడే కూలిపోయాయి. శనివారం ఉదయం వరకు 14 మంది మరణిం , 419 మంది గాయపడ్డారని రైటర్స్ వార్త సంస్థ తెలిపింది. అలాగే 70 మందిని శిథిలాల నుంచి రక్షించినట్లు ఇజ్మీర్ గవర్నర్ తెలిపారు. దీంతో ఇజ్మీర్‌లో ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగెత్తారు. ఏజియన్ సముద్రంలో భూకంపం, సునామీ రావడంతో తీర ప్రాంతాలైన టర్కీ, గ్రీస్‌పై ప్రభావం ఎక్కువగా పడినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ తెలిపారు. కాగా కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.