ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఢిల్లీలోని నోయిడా , హర్గుయాణాలోని గురుగ్రామ్ లో భూకంప తీవ్రత 4.2గా నమోదైందని సిస్మోలజీ అధికారులు తెలిపారు. హర్యానాలోని గురుగ్రామ్ నైరుతి దిశలో 48 కిలోమీటర్ల దూరంలో, 7.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. అలాగే రాజస్థాన్ లోని అల్వార్లో ఐదు కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత గుర్తించామన్నారు. అర్ధరాత్రి 11 గంటలకు ఈ భూ ప్రకంపనాలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ సంఘటనతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సిస్మోలజి అధికారులు వివరించారు.