https://oktelugu.com/

కరోనా వైరస్ ను గుర్తించే కొత్త యాప్.. ఎలా పని చేస్తుందంటే..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల మనుషుల జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తుమ్మినా, దగ్గినా కరోనా వైరస్ సోకిందేమో అని భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నామని కొందరు బాధితులు వాపోతున్నారు. కరోనా సోకిందో లేదో తెలుసుకోవాలంటే కరోనా పరీక్షలు చేయించుకోవడం మినహా మరో మార్గం లేదు. Also Read: కరోనా వైరస్ ఉన్నంత కాలం మనవాళి ప్రమాదంలో ఉన్నట్లేనా? అయితే శాస్త్రవేత్తలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2020 / 09:31 AM IST
    Follow us on


    దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల మనుషుల జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తుమ్మినా, దగ్గినా కరోనా వైరస్ సోకిందేమో అని భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నామని కొందరు బాధితులు వాపోతున్నారు. కరోనా సోకిందో లేదో తెలుసుకోవాలంటే కరోనా పరీక్షలు చేయించుకోవడం మినహా మరో మార్గం లేదు.

    Also Read: కరోనా వైరస్ ఉన్నంత కాలం మనవాళి ప్రమాదంలో ఉన్నట్లేనా?

    అయితే శాస్త్రవేత్తలు టెక్నాలజీ సహాయంతో కరోనా వైరస్ ను గుర్తించేందుకు ప్రయోగాలు చేపడుతున్నారు. శాస్త్రవేత్తలు స్మార్ట్ ఫోన్ తో కరోనాను గుర్తించే సరికొత్త అల్గారిథంను అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్తలు ఈ అల్గారిథం కరోనా లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా వైరస్ సోకితే విజయవంతంగా నిర్ధారిస్తోందని చెబుతున్నారు. త్వరలో ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ యాప్ పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    Also Read: కరోనా టెస్టులు ఇకపై తెలంగాణలోనూ కారుచౌకగా..!

    అమెరికాకు చెందిన మసాచుటెచ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ యాప్ ను డెవలప్ చేశారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే కరోనా నిర్ధారణ పరీక్షల అవసరం తగ్గిపోతుందని.. రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత యాప్ ను విడుదల చేస్తామని యాప్ విడుదలైతే ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా ఏ ప్రదేశం నుంచైనా వైరస్ ను గుర్తించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడిన ప్రజలకు 2021 సంవత్సరంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుండటంతో వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో ప్రజలకు తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.