కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ దేశవ్యాప్తంగా శనివారం ప్రారంభించారు. 259 ప్రాంతాల్లో తొలిదశలో వైద్యులు, పారిశుధ్య కార్మికులు, వ్రుద్ధులకు కరోనా టీకా వేయనున్నారు. రెండో దశలో సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న డ్రైరన్ ను కేంద్రమంత్రి హర్షవర్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వీడాలన్నారు. వ్యాక్సిన్ పంపిణీపై వైద్య బ్రుందం ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని త్వరలో మిగతావారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామన్నారు. 1994లో పల్స్ పోలియో డ్రైవ్ విజయవంతం చేసినట్లుగానే కరోనా వ్యాక్సిన్ ను సక్సెస్ చేయాలని అధికారులకు సూచించారు. కాగా తెలంగాణలోని 7 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తిలక్ నగర్, నాంపల్లి, సోమాజిగూడ, గాంధీ ఆసుపత్రిలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లోని జానంపేట, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నేహా షైన్ ఆసుపత్రుల్లోనూ డమ్మీ కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు.