https://oktelugu.com/

ఉప ముఖ్యమంత్రికి కరోనా

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సాహ్‌నవాజ్‌ హుస్సేన్‌కు కరోనా సోకిన  విషయం తెలిసిందే. అంతకుముందు సాహ్‌నవాజ్‌తో కాంటాక్ట్‌లో ఉన్న బీజేపీ నేతలు మంగళ్‌పాండే, రాజీవ్‌ ప్రతాప్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. అటు మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బీహార్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లి కరోనాతో తిరిగి వచ్చారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 26, 2020 / 12:55 PM IST
    Follow us on

    మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల సాహ్‌నవాజ్‌ హుస్సేన్‌కు కరోనా సోకిన  విషయం తెలిసిందే. అంతకుముందు సాహ్‌నవాజ్‌తో కాంటాక్ట్‌లో ఉన్న బీజేపీ నేతలు మంగళ్‌పాండే, రాజీవ్‌ ప్రతాప్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. అటు మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బీహార్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లి కరోనాతో తిరిగి వచ్చారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు కరోనాతో ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్నవారు ఆందోళన చెందుతున్నారు.