పండుగ వేళ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఆర్టీసీలు

అవును… ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు దేశాల్లా వ్యవహరిస్తున్నాయి. తమతమ బార్డర్లలో ఇండియా-పాకిస్తాన్‌ బార్డర్లను తలపిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటారా.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులు నడిపించడంపై చేస్తున్న రాద్ధాంతమే ఇందుకు కారణమైంది. ఇరు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములమనే చెప్పుకుంటున్న పాలకులు అసలు చేస్తున్నదేంటి..? పండుగ పూట ఆర్టీసీ ప్రయాణికులకు ఈ కష్టాలేంటి..? పట్టింపులకు పోయి చేసేది ఏంది..? ఫైనల్‌గా లాస్‌ అవుతున్నది ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు, ప్రజలే కదా..? అని మండిపడుతున్నారు. […]

Written By: NARESH, Updated On : October 26, 2020 3:48 pm
Follow us on

అవును… ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు దేశాల్లా వ్యవహరిస్తున్నాయి. తమతమ బార్డర్లలో ఇండియా-పాకిస్తాన్‌ బార్డర్లను తలపిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటారా.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులు నడిపించడంపై చేస్తున్న రాద్ధాంతమే ఇందుకు కారణమైంది. ఇరు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములమనే చెప్పుకుంటున్న పాలకులు అసలు చేస్తున్నదేంటి..? పండుగ పూట ఆర్టీసీ ప్రయాణికులకు ఈ కష్టాలేంటి..? పట్టింపులకు పోయి చేసేది ఏంది..? ఫైనల్‌గా లాస్‌ అవుతున్నది ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు, ప్రజలే కదా..? అని మండిపడుతున్నారు. ఈ విషయం పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Also Read: రాజధానే లేదు.. విశాఖలో మెట్రో నిర్మిస్తారట..!

అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ, ఏపీఎస్‌ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత నిర్వహించిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. పండుగ సందర్భంగా ప్రయాణికులు సౌలభ్యం కోసం చెరో 200 బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినా అందుకు తెలంగాణ ఆర్టీసీ ముందుకు రాలేదు. ఇప్పటికే ఏపీ మంత్రి పేర్ని నాని ఆర్టీసీ బస్సు సర్వీసుల సమస్యకు ప్రధాన కారణం తెలంగాణనే అని చేతులు దులుపుకున్నారు. తెలంగాణ అధికారులు మాత్రం ఏపీలో బస్సులు నడపడం తమకు నష్టమని.. వాటా ఎక్కువ కోరుతున్నారు. రెండు రాష్ట్రాల పంతాల వల్ల ప్రయాణికులు ఇప్పుడు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.

ప్రత్యామ్మాయ చర్యలు చేపట్టకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ప్రజల జేబులకు కన్నాలు వేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీసీ సంస్థలు సరిహద్దుల వరకే నడిపించడం వల్ల ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ప్రయాణం పండుగ పూట ప్రజలకు పెను భారమవుతోంది. కాస్త దూరానికి రూ.200 నుంచి 500 వరకు తీసుకుంటూ ప్రైవేట్ వాహన యజమానులు ప్రయాణికులను దోచుకుంటున్న పరిస్థితి నెలకొంది.

పంతాలతో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్తలు బోర్డర్ వరకే బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కాస్త ప్రయాణికుల్లో కోపం తెప్పించింది. పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. హైదరాబాద్ నుంచి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చే వారికి షటిల్ సర్వీసులు ఏర్పాటు చేశారు.

మరోవైపు తెలంగాణ నుంచి కూడా ఏపీ బోర్డర్ వరకే బస్సులు నడిపించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోలేమని, శాశ్వత ఒప్పందం కుదిరిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఆర్టీసీ మొండిపట్టుతో ఇలా సరిహద్దు వరకే నడిపించింది. దీంతో దసరా పండుగకు ఆర్టీసీ బస్సుల్లో ఊళ్లకు వెళ్లాలని బయల్దేరిన వారు బోర్డర్ వరకు చేరి.. ఆ తర్వాత ఏపీలోకి ప్రైవేట్ వాహనాల్లో భారీగా డబ్బులు చెల్లించి వెళ్లి మరో బస్సు ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇదంతా తీవ్ర వ్యయప్రయాసలతోపాటు అదనంగా భారీగా ప్రయాణికులకు ఖర్చైంది.

Also Read: హమ్మయ్య..! డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చారు

ఇలా ఇరు రాష్ట్రాల ఆర్టీసీ నిర్ణయంతో.. ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ అయిన కృష్ణాజిల్లా గరికపాడు చెక్ పోస్టు దగ్గర పండుగ రోజు ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. తెలుగురాష్ట్రాల ఆర్టీసీ చర్చల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల లేకుండా పోయాయి. అరకొరగా సరిహద్దుల దగ్గర ఆర్టీసీ బస్సులను ఇరు ప్రభుత్వాలు ఏర్పాటుచేసినప్పటికీ, రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద బస్సులు మారటానికి ప్రయాణికులు ఇష్టపడలేదు. మరోవైపు, ఇద్దరు.. ముగ్గురు కోసం బస్సులు నడపలేమని బస్సు ఫుల్ అయిన తర్వాతే గమ్యానికి చేరుస్తామని బస్సు డ్రైవర్, కండక్టర్ చెబుతుండటంతో ప్రజలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద బ్రేక్ డౌన్ పై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఫొటోరైటప్: గరికపాడు చెక్ పోస్టు వద్ద ప్రయాణికుల అవస్థలు ఇవీ..