కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తనకు కరోనా సోకిందని స్వయంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తనను కలిసిన వారందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా రావడంతో ఆయన బీహార్ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఆజాద్ ఇటీవల రాజ్యసభలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో ముందున్నాడు. రాజ్యసభ సభ్యులతో ఆయన కలిసే ఉండడంతో పలువురి రాజ్యసభ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.