వైరల్ అవుతోన్న ‘సుమ’ వీడియో !

యాంకర్ ‘సుమ’ యాంకరింగ్ కంటే కూడా, ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఎక్కువుగా గడుపుతొంది. ముఖ్యంగా తానూ కోవిడ్ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో వివరిస్తూ.. తన ఫాలోవర్స్ ను కూడా తనలాగే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కోరుతూ పోస్ట్ లు పెడుతొంది. అయితే సుమ సరదాగా పోట్లాడినా చాల సీరియస్ గా తీసుకుంటారట ఆమె సర్కిల్స్ లోని వ్యక్తులు. ఎందుకంటే సుమకు ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే చాలు ఇక వారిని తెగ వాయించేస్తోందట, పైగా మాస్క్ […]

Written By: admin, Updated On : October 16, 2020 3:49 pm
Follow us on


యాంకర్ ‘సుమ’ యాంకరింగ్ కంటే కూడా, ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఎక్కువుగా గడుపుతొంది. ముఖ్యంగా తానూ కోవిడ్ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో వివరిస్తూ.. తన ఫాలోవర్స్ ను కూడా తనలాగే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కోరుతూ పోస్ట్ లు పెడుతొంది. అయితే సుమ సరదాగా పోట్లాడినా చాల సీరియస్ గా తీసుకుంటారట ఆమె సర్కిల్స్ లోని వ్యక్తులు. ఎందుకంటే సుమకు ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే చాలు ఇక వారిని తెగ వాయించేస్తోందట, పైగా మాస్క్ పెట్టుకో అని బెదిరించి మరీ, వారి చేత మాస్క్ పెట్టిస్తోందట. సుమ పోట్లాడే ఇలాంటి కొన్ని వీడియోలు కూడా ఆ మధ్య బాగానే వైరల్ అయ్యాయి.

Also Read: హాట్ టాపిక్:ఆ మూవీలో నటించే జంటలకు పెళ్లి అవుతుందా?

ముఖ్యంగా తన మేకప్ రూంలో మేకప్ మ్యాన్‌ ను, అలాగే లిఫ్ట్‌లో ఓ అబ్బాయిని మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అంటూ వారిని దడ దడలాడించేసింది. ఇక బయట ఇలాంటి అజ్రాగ్రత్తపరులు ఉండటం వల్లే తాను మరింతగా జాగ్రత్తలు తీసుకుంటుందట. మాస్క్ పెట్టుకోండి, భౌతిక దూరాన్ని పాటించాలని చెబుతున్నా కొంతమంది పాటించడం లేదు కాబట్టే.. షూట్ కి వెళ్లాలంటేనే భయపడుతొందట. అయినా నిత్యం షూటింగ్‌ లంటూ అక్కడికి ఇక్కడికి తిరిగే వాళ్లు కనీసం జాగ్రత్తగా ఉండాలి కదా. చిన్న మాస్క్ కూడా పెట్టుకోకుండా షూట్స్ లో పాల్గొంటే.. ఒకవేళ కరోనా ఉంటే.. ఆ సెట్ లో ఉన్న అందరికీ ఒకేసారి కరోనా అటాక్ అయ్యే అవకాశం ఉంది కదా. అందుకే సుమ ఇక లాభం లేదనుకొని కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది.

Also Read: కొత్త లుక్కులో ఆకట్టుకుంటున్న ‘కొమురంభీం’ ఎన్టీఆర్.!

ప్రతిరోజూ షూట్ నుండి వెళ్ళాక, సుమ తన ఇంట్లో ప్రత్యేకంగా ఆవిరి పట్టుకుంటుందని.. పైగా తనతో పాటు తన తోటివారి చేత కూడా అలాగే ఆవిరి పట్టిస్తోందట. సుమను చూసి మిగతా నటీమణులు కూడా ఇలాంటి జాగ్రత్తలనే పాటిస్తున్నారట. సురేఖా వాణి కూడా షూటింగ్ గ్యాప్‌లోనే ఆవిరి పట్టేసుకుంటానని.. ఓ వీడియోను కూడా రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా సుమ కూడా ఇంట్లో ఆవిరి పట్టుకుంటున్న తన వీడియోను షేర్ చేస్తూ.. పనిలో పనిగా అందరూ ఇలాగే చేయండని ఓ ఉచిత సలహా కూడా ఇస్తూ.. ‘సురక్షితంగా ఉండండి.. మీ ఆరోగ్యం, సంతోషం పట్ల బాధ్యతాయుతంగా మెలగండి.. అందరూ ఆవిరి పట్టుకోండి’ అంటూ తన టైమింగ్ తో సరదాగా చెప్పుకొచ్చింది. ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.