దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,342 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అంతకుముందు 70వేల మార్క్‌ దిగని కరోనా పాజిటివ్‌ల సంఖ్య మంగళవారం ఒక్కసారిగా 55 వేలకు రావడం కొంత ఊరటిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71,75,881కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 706 మంది వైరస్‌ సోకి మరణించారు. దీంతో 1,09,856కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,67,496 యాక్టివ్‌ కేసులు […]

Written By: Suresh, Updated On : October 13, 2020 10:33 am

carona

Follow us on

దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,342 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అంతకుముందు 70వేల మార్క్‌ దిగని కరోనా పాజిటివ్‌ల సంఖ్య మంగళవారం ఒక్కసారిగా 55 వేలకు రావడం కొంత ఊరటిస్తోంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71,75,881కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 706 మంది వైరస్‌ సోకి మరణించారు. దీంతో 1,09,856కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 8,67,496 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 60,77,977 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.