https://oktelugu.com/

ఏపీ తీరం దాటిన వాయుగుండం.. ప్రజలకు హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీజన్‌ మొత్తం వానలు కురుస్తుండడంతో ఒకింత హర్షం వ్యక్తం అవుతున్నా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు. ఇక హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి నగరాల్లో మాత్రం వర్షం అంటేనే ఇప్పుడు భయపడే పరిస్థితి దాపురించింది. ఇప్పటి వరకు పడిన వర్షాలతో ఈ నగరాలు అతలాకుతలం అయిన విషయం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 12:20 pm
    Follow us on

    బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీజన్‌ మొత్తం వానలు కురుస్తుండడంతో ఒకింత హర్షం వ్యక్తం అవుతున్నా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలతో ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు. ఇక హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి నగరాల్లో మాత్రం వర్షం అంటేనే ఇప్పుడు భయపడే పరిస్థితి దాపురించింది. ఇప్పటి వరకు పడిన వర్షాలతో ఈ నగరాలు అతలాకుతలం అయిన విషయం తెలిసింది.

    Also Read: దుబ్బాక పాలి‘ట్రిక్స్’.. రేవంత్ రహస్య చర్చలు..!

    మంగళవారం  కాకినాడ వద్ద వాయుగుండం తీరం దాటడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం మీదుగా కాకినాడ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చి కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్లు అధికారులు తెలుపుతున్నారు.  ఇక తెలంగాణలోని వరంగల్‌లో  మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం సూచించారు.

    ప్రస్తుతం వాయుగుండం భూభాగంపైకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, కృష్ణా, తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల వర్షాలు మొదలైనా కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలపింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశాలు ఉన్నందున రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. వర్ష బాధిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

    Also Read: రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ చానెళ్లపై బాలీవుడ్ ప్రముఖుల యుద్ధం.. హైకోర్టుకు..

    హైదరాబాద్‌ గత కొన్ని రోజులుగా రోజూ వర్షం కురుస్తూనే ఉంది. నగరపరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉండడంతో వరదనీరు పొంగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లుకూలి చిన్నారులతో సహా మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ నిన్న శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వదిలేయండని సూచించారు. అయితే ఇప్పుడు కురిసే వర్షాలకే ఏ మేరకు ప్రభావం ఉంటుందో చూడాలి..