Pawan Kalyan Kakinada speech : పవన్ కళ్యాణ్ కాకినాడ మాటామంతీలో ఆ మాటలు మాట్లాడడానికి ధైర్యం కావాలి. రాజకీయ నాయకులు ఎప్పుడూ పూర్తిగా నిజాలు మాట్లాడరు. అటువంటి పచ్చి నిజాలు మాట్లాడారు. ఇది సగటు రాజకీయ నాయకుడికి భిన్నంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కనిపిస్తోంది. నేరస్థుడికి కులం ఏంటి? మతం ఏంటి? అని పవన్ నిలదీశారు. తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు ప్రమాదకరం అని పవన్ హెచ్చరించారు. ఎక్కువ కేసులు దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. కులం కుంపట్లు ఏపీలో పోయినప్పుడే ఏపీ బాగుపడుతుందని పవన్ కుండబద్దలు కొట్టారు.
కులం కొట్లాటలలో నన్ను ఇరికించవద్దని.. పోలీసులకు మనం ఫోన్లు చేసి వాళ్ల పని వాళ్లను చేయించుకోవాలని పవన్ కుండబద్దలు కొట్టారు. ఆంధ్రాకు కులం జబ్బు, తెలంగాణ ప్రాంతీయవాదం జబ్బు హద్దు మీరకూడదని చెప్పారు. వీటిని రోగాలుగా వర్ణించాడు. ఈ రెండూ కరెక్ట్ గా రెండు రాష్ట్రాలకు అతికినట్టు చెప్పాడు.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు పట్టిన రోగాన్ని పసిగట్టాడు పవన్ కళ్యాణ్. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

