
చైనాలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. దీంతో చైనాలోని అత్యంత రద్దీ గా ఉండే విమానాశ్రయం పుడాంగ్ ఎయిర్ పోర్టులో విమాన సేవల రద్దు చేశారు. షాంఘై ప్రాంతంలో ఇటీవల 7 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిందరికి ఈ ఎయిర్ పోర్టుతో సంబంధాలున్నాయి. దీంతో విమానాశ్రయంలో వైమానిక సేవలు నిలిపివేశారు. కరోనా పుట్టినిల్లుగా పేర్కొంటున్న చైనాలో మళ్లీ సెకండ్ వేవ్ తో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఇక్కడ దాదాపు 500 విమాన సేవల రద్దయ్యాయి. మొత్తమ్మీద 17,700 మందికి కరోనా టెస్టులు చేయించారు. ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అభివ్రుద్ధి చేస్తుండగా మరోవైపు ఇలా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.