
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో సీఐడీ అధికారిణి పీవి లక్ష్మి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. పీవీ లక్ష్మి బెంగూళూరులోని క్రైం బ్రాంచ్ లో విచారణ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే గత రాత్రి బెంగుళూరులోని అన్నపూర్ణేశ్వరిలో ఆమె తన స్నేహితుడి ఇంటికి విందుకోసం వెళ్లారు. ఆ తరువాత రాత్రి 10.30 గంటలకు ఆమె ఓ గదిలో ఉరివేసుకున్నట్లు సంఘటనా స్థలానికి చేరుకున్న అన్నపూర్ణేశ్వరి పోలీసులు తెలిపారు. అమె మ్రుతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి మరణంపై దర్యాప్తు చేపట్టారు.. 2014లో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ర్యాంకు సాధించిన లక్ష్మి 2017లో సీఐడీలో చేరిసింది.