
అడ్డగోలు దురాక్రమణలకు తెగబడుతున్న చైనాపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరోక్ష విమర్శలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందాలు ఏ విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఘటనలే తార్కాణాలని పేర్కొన్నారు. ‘మన హిమాలయన్ ఫ్రాంటియర్స్‌లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా దురాక్రమణలకు తెగబడుతుండటం చూస్తే ప్రపంచం ఏవిధంగా మార్పులకు గురవుతున్నదో, అమలులో ఉన్న ఒప్పందాలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయో అవగతమవుతున్నది. ఇది హిమాలయాలకే పరిమితం కాదు, ఇండో-పసిఫిక్ విషయంలోనూ ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి’ అని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.