బీహార్: బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు

బీహార్ 4 వ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఎన్డీయే కూటమిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఏయే పదువులు వస్తాయోనన్న ఉత్కంఠకు తెర పడింది. రెండు ఉప ముఖ్యమంత్రులు, ఒక స్పీకర్ పదవి బీజేపీకి దక్కేలా నిర్ణయం చేసుకున్నాయి. బీజేపీ శాసనసభ పక్షనేత తర్కిషోర్ ప్రసాద్, రేణూ దేవీలకు డీప్యూటీ సీఎం పదవులు లభించగా, మరో సీనియర్ ఎమ్మెల్యేకు అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం కన్పస్తోంది. అయితే గత […]

Written By: Suresh, Updated On : November 16, 2020 11:52 am
Follow us on

బీహార్ 4 వ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఎన్డీయే కూటమిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ఏయే పదువులు వస్తాయోనన్న ఉత్కంఠకు తెర పడింది. రెండు ఉప ముఖ్యమంత్రులు, ఒక స్పీకర్ పదవి బీజేపీకి దక్కేలా నిర్ణయం చేసుకున్నాయి. బీజేపీ శాసనసభ పక్షనేత తర్కిషోర్ ప్రసాద్, రేణూ దేవీలకు డీప్యూటీ సీఎం పదవులు లభించగా, మరో సీనియర్ ఎమ్మెల్యేకు అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం కన్పస్తోంది. అయితే గత 15 ఏళ్లుగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుశీల్ మోదీకి ఏం పదవి ఇస్తారోననే సస్పెన్ష్ ఇంకా వీడలేదు. ఇటీవల జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 125 స్థానాలను కైవలం చేసుకోగా ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 40 స్థానాల్లో గెలుపుపొందింది. ప్రతిపక్షఆర్జేడీ ఎక్కువ సీట్లలో గెలుపొందినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ దాటలేనందున అధికారం చేజిక్కించుకోలేకపోయింది. మొత్తానికి ఈరోజు ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు చేయనుంది.