https://oktelugu.com/

మహారాష్ట్రలోనూ బీజేపీకి ఎదురుదెబ్బ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన కూటమి విజయం

మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి శివసేన కూటమి ‘మహా వికాస్ ఆఘాడీ’ షాక్ నిచ్చింది. మొత్తం 6 స్థానాల్లో నాలుగు స్థానాల్లో శివసేన కూటమి విజయం దిశగా వెళుతోంది. ఇక్కడి ఔరంగాబాద్, ఫూణె పట్టభద్రుల నియోజకవర్గాలను ఎన్సీపీ గెలుచుకుంది. మరో రెండు స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం దిశగా వెళుతున్నారు. కాగా తనకు మంచి పట్టు ఉన్న పట్టభద్రుల నియోజకవగ్గాల్లో బీజేపీ ఆ […]

Written By: , Updated On : December 4, 2020 / 04:04 PM IST
Follow us on

మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి శివసేన కూటమి ‘మహా వికాస్ ఆఘాడీ’ షాక్ నిచ్చింది. మొత్తం 6 స్థానాల్లో నాలుగు స్థానాల్లో శివసేన కూటమి విజయం దిశగా వెళుతోంది. ఇక్కడి ఔరంగాబాద్, ఫూణె పట్టభద్రుల నియోజకవర్గాలను ఎన్సీపీ గెలుచుకుంది. మరో రెండు స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం దిశగా వెళుతున్నారు. కాగా తనకు మంచి పట్టు ఉన్న పట్టభద్రుల నియోజకవగ్గాల్లో బీజేపీ ఆ పట్టును కోల్పోయింది. డిసెంబర్ 1న ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కేవలం ఒక చోట మాత్రమే బీజేపీ లీడింగ్ లో ఉండడంతో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందించారు. మేం అనుకున్నట్లు స్థానాలను గెలుచుకోలేకపోయామయన్నారు. ఎక్కువ సీట్లు వస్తాయని అనుకున్నాం. కానీ ఒక్కసీటే గెలిచామన్నారు. ముఖ్యంగా నాగపూర్ విషయానికొస్తే దేవేంద్ర పఢ్నవీస్ తండ్రి గంగాధర రావు ఫడ్నవీస్ ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు.