కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారా? మాజీ ఎంపీ సంచలన కామెంట్స్

గ్రేటర్ ఎన్నికలు ఫలితాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకెళుతుండగా ఆపార్టీకి ధీటుగా బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు ఎంఐఎం కూడా రేసులో ముందుంది. అయితే కాంగ్రెస్ మాత్రం తన స్థాయికి తగ్గ రేంజులో సత్తా చాటడం లేదు. కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించి మరో రెండు స్థానాల్లో మాత్రమే అధిక్యంలో కొనసాగుతోంది. Also Read: రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..? పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డ టీఆర్ఎస్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం […]

Written By: Neelambaram, Updated On : December 4, 2020 5:23 pm
Follow us on


గ్రేటర్ ఎన్నికలు ఫలితాలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకెళుతుండగా ఆపార్టీకి ధీటుగా బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు ఎంఐఎం కూడా రేసులో ముందుంది. అయితే కాంగ్రెస్ మాత్రం తన స్థాయికి తగ్గ రేంజులో సత్తా చాటడం లేదు. కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించి మరో రెండు స్థానాల్లో మాత్రమే అధిక్యంలో కొనసాగుతోంది.

Also Read: రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..?

పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డ టీఆర్ఎస్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం దూసుకెళుతోంది. తాజా సమాచారం మేరకు టీఆర్ఎస్ 69స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తుండగా బీజేపీ 39 స్థానాల్లో.. ఎంఐఎం 44 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కు ఊహించని విధమైన ఫలితాలు వస్తుండటంపై ఆపార్టీలో అంతర్మథనం మొదలైనట్లు కన్పిస్తోంది.

ఈ ఫలితాలు కాంగ్రెస్ నేత, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఢీకొట్టే సత్తా బీజేపీ ఉందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో బీజేపీ అధిక్యం ప్రదర్శించిన నేపథ్యంలో ఆయన ట్వీటర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కొండా బీజేపీ వైపు చూస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

Also Read: జీహెచ్ఎంసీలో కారు జోరు.. కమలం బేజారు

గత ఎన్నికలకు కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ చేరారు. కాంగ్రెస్ నుంచి చేవేళ్లలో పోటీచేసి స్పల్ప ఓట్లతో ఓడిపోయారు. కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డే కారణం. ఎంపీగా ఓడిపోయిన కూడా ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ వీడుతారనే ప్రచారం ఇటీవల సాగింది. ఈనేపథ్యంలో కొండా విశ్వశ్వేరరెడ్డి బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ లో కలవరం రేపుతోంది. ఈనేపథ్యంలో కొండా కాంగ్రెస్ కు హ్యండిచ్చి బీజేపీలో చేరుతారనే ప్రచారం మరోసారి జోరందుకుంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్