బాబ్రీ మసీదు కేసుపై రేపు వెలువడనున్న తీర్పు..!

బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై బుధవారం తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్ల నుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం బుధవారం తీర్పును వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. 1992 డిసెంబర్‌ 6న యూపీలోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. ఇందులో కరసేవకులు నిందితులుగా ఉన్నారు. వారిలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, అశోక్‌ సింగాల్‌, కల్యాణ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. ఈ కేసును రెండేళ్లలో విచారణ పూర్తి […]

Written By: NARESH, Updated On : September 29, 2020 10:22 am

babri

Follow us on

బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై బుధవారం తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్ల నుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం బుధవారం తీర్పును వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. 1992 డిసెంబర్‌ 6న యూపీలోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. ఇందులో కరసేవకులు నిందితులుగా ఉన్నారు. వారిలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, అశోక్‌ సింగాల్‌, కల్యాణ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు. ఈ కేసును రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని 2017లో సుప్రీం కోర్టు ఆదేశించింది. 2019లో గడువు ముగియడంతో మరో 9 నెలల పాటు పొడగించింది. మరికొంత సమయం కావాలని సీబీఐ కోరగా ఈనెల 30 వరకు అవకాశమిచ్చింది. దీంతో బుధవారం ఎటువంటి తీర్పు వెలువడనుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

Also Read: వైరల్: కాళ్లు మొక్కి కుర్చీ లాగేశావా అచ్చెన్నా?