టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బెయిల్ గడువు సుప్రీం కోర్టు మరో నాలుగు వారాలు పొడిగించింది. అర్కిటెక్చరల్ ఫర్మ్ అధిపతి ఆత్మహత్య చేసుకునే విధంగా ఆర్నాబ్ గో స్వామి తో పాటు మరికొందరికి ముంబై కోర్టు జ్యూడిషియల్ కస్టడి విధించిన విషయం తెలిసిందే. వారం రోజుల తరువాత ఈనెల 11న అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఈ బెయిల్ పై జస్టిస్ చంద్రచూడ్ కోర్టులో వాదించారు. అర్కిటెక్చరల్ అధిపతి ఆత్మహత్య చేసుకునే విధంగా అర్నాబ్ గో స్వామి ప్రేరేపించినట్లు చెప్పలేమన్నారు. బాంబే హైకోర్టు ఈ కేసుపై ప్రాథమికంగా విలువకట్టినప్పటికీ, ఎఫ్ఐఆర్, ఐపీసీ 306 మధ్య సంబంధం లేదన్న విషయాన్ని గ్రహించలేకపోయారని తెలిపారు.