https://oktelugu.com/

గేమ్ లో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య

ఆన్ లైన్ గేమింగ్ కు యువకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఈ గేమింగ్ మాయలో పడి పలువురు అప్పుల పాలవుతున్నరు. వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో యువకుడు ఆన్ లైన్ గేమింగ్ కు బలయ్యాడు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కు చెందిన జగదీశ్ ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడు. ఈ గేమ్ లో పడి లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. దీంతో ఆ అప్పలు తీర్చే మార్గం లేక శుక్రవారం ఆత్మ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 27, 2020 / 01:43 PM IST
    Follow us on

    ఆన్ లైన్ గేమింగ్ కు యువకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఈ గేమింగ్ మాయలో పడి పలువురు అప్పుల పాలవుతున్నరు. వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో యువకుడు ఆన్ లైన్ గేమింగ్ కు బలయ్యాడు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కు చెందిన జగదీశ్ ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడు. ఈ గేమ్ లో పడి లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. దీంతో ఆ అప్పలు తీర్చే మార్గం లేక శుక్రవారం ఆత్మ హత్య చేసుకున్నాడు. ‘తాను అప్పుల ఊబిలో చిక్కుకున్నానని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు’ ఓ వీడియోలో వివరించాడు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.