https://oktelugu.com/

బిగ్ బాస్-4: దెయ్యంగా మారిన జలజ.. ఎవరో తెలుసా?

బిగ్ బాస్-4 సీజన్ గత సీజన్లకు భిన్నంగా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్-4 ప్రారంభ ఎపిసోడ్ కు అదిరిపోయే టీఆర్పీ వచ్చింది. 18 టీఆర్పీతో టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఆ తర్వాత టీఆర్పీ క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈక్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా టాస్కులతో అభిమానులను ఎంటటైన్ చేస్తున్నారు. Also Read: కంగన రౌనత్ కు భారీ ఊరట బిగ్ బాస్-4 సీజన్ చివరి అంకానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 01:26 PM IST
    Follow us on

    బిగ్ బాస్-4 సీజన్ గత సీజన్లకు భిన్నంగా కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్-4 ప్రారంభ ఎపిసోడ్ కు అదిరిపోయే టీఆర్పీ వచ్చింది. 18 టీఆర్పీతో టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది. అయితే ఆ తర్వాత టీఆర్పీ క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈక్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా టాస్కులతో అభిమానులను ఎంటటైన్ చేస్తున్నారు.

    Also Read: కంగన రౌనత్ కు భారీ ఊరట

    బిగ్ బాస్-4 సీజన్ చివరి అంకానికి చేరుకోవడంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 20న బిగ్ బాస్-4 గ్రాండ్ ఫినాలే నిర్వహించేందుకు షో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. రకరకాల ట్వీస్టులతో సాగుతున్న బిగ్ బాస్ లోకి తాజాగా దెయ్యం ఎంట్రీ కంటెస్టెంట్లను ఓ ఆటఆడేసుకుంటోంది.

    బిగ్ బాస్-4లో నిర్వాహకులు ఎక్కువగా లవ్ ట్రాక్ పైనే ఫోకస్ పెట్టారు. దీంతో షోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే సరికొత్త టాస్కులు పెడుతూ సరికొత్త టీజర్లను విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ దెయ్యం ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లను భయపెట్టడమే కాకుండా టాస్కులతో షోను గురువారం మలుపు తిప్పింది.

    Also Read: బాలీవుడ్ ‘ఛత్రపతి’గా ఆ హీరో రాణిస్తాడా?

    నిన్నటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు దెయ్యం కంటెస్టెంట్లను కన్‌ఫెషన్ రూమ్‌లోని స్పూన్లు తీసుకు రావాలని పిలిచి పనిష్మెంట్ ఇచ్చి కామెడీ పంచింది. ఇంగ్లీష్‌లో మాట్లాడాడే కారణంతో అభిజిత్‌కు శిక్ష విధించింది. దీంతోపాటు మరికొన్ని టాస్కులు ఇచ్చింది. ఇప్పటి వరకు జరిగిన బెస్ట్ ఎపిసోడ్ ఇదొకగా నిలిచిందనే టాక్ విన్పిస్తోంది.

    అయితే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన దెయ్యం ఎవరనేది తేలిసిపోయింది. సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న యాంకర్ కమ్ హీరోయిన్ భానుశ్రీ అని లీకైంది. జలజగా ఎంట్రీ ఇచ్చిన ఈ దెయ్యానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా ఒకప్పటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన గీతా మాధురి అని ఇప్పటికే తెలిసిపోయింది. మొత్తానికి బిగ్ బాస్-4 పాత.. కొత్త కంటెస్టెంట్లంతా కరోనా టైంలో బుల్లితెర ప్రేక్షకులను ఎంటటైన్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్