
వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రే రూపొందించినవి కావని, పార్టీలు, నిపుణులు, రైతుల అభిప్రాయంతో రూపొందించినవని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ‘కిసాన్ కల్యాన్‘ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 20 నుంచి 30 సంవత్సరాలుగా ఈ చట్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణాత్మక చర్చలు జరిపాయన్నారు. వ్యవసాయ చట్టాలు, ఎమ్మెస్పీలపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. స్వామినాథన్ కమిటీ నివేదికపై ప్రతిపక్ష పార్టీలు కొన్నేళ్లుగా చర్చించాయని, 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవసాయ రుణ మాఫీ పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.