అదనపు డీజీపీ రాజీనామా
కర్టాటక అదనపు డీజీపీ రవీంద్రనాథ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే తనకు పదోన్నతి లభించడం లేదనే అసంతృప్తితో రాజీనామా పత్రాన్ని పోలీస్ కంట్రోల్ రూంకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకంటే జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని, నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలియదు గాని వీటన్నింటి భరిస్తూ నేను ఈ ఉద్యోగంలో ఉండలేనన్నారు. నాకంటే డీజీపీకి రూ. 300 వేతనం ఎక్కువగా వస్తుందని, అయితే నాకు ప్రశాంతత కరువైందని ఆయన […]
Written By:
, Updated On : October 30, 2020 / 02:06 PM IST

కర్టాటక అదనపు డీజీపీ రవీంద్రనాథ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే తనకు పదోన్నతి లభించడం లేదనే అసంతృప్తితో రాజీనామా పత్రాన్ని పోలీస్ కంట్రోల్ రూంకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకంటే జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని, నన్ను ఎవరు టార్గెట్ చేస్తున్నారో తెలియదు గాని వీటన్నింటి భరిస్తూ నేను ఈ ఉద్యోగంలో ఉండలేనన్నారు. నాకంటే డీజీపీకి రూ. 300 వేతనం ఎక్కువగా వస్తుందని, అయితే నాకు ప్రశాంతత కరువైందని ఆయన ఆవేదన చెందారు. నేను గతంలోనే మూడుసార్లు రాజీనామాకు ప్రయత్నించానన్నారు.