
దేశంలో 24 గంటల్లో 66,732 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 816 మంది వైరస్ తో మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం దేశవ్యాప్తంగా 1,09150 మంది మరణించారు. ిక 61,49,536 మంది కోలుకోగా ప్రస్తతం 8,61,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అత్యధిక కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 308 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.54 శాతం ఉందని కేంద్ర, ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది.