సోషల్ మీడియాలో కొందరు దుండగులు చేసిన తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్త మైంది. దీంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారణాసిలోని ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయాన్ని కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు. వారణాసిలోని గురుధామ్ కాలనీలు ఉన్న ఈ కార్యాలయాన్ని రూ.7.5 కోట్లు అమ్మెందుకు సిద్ధంగా ఉన్నామని తెలపాడు. ఈ విషయం పోలీసుల ద్రుష్టికి రావడంతో వెంటనే ఓఎల్ఎక్స్ నుంచి ఆ యాడ్ ను తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వారణాసి ఎస్పీ అమిత్ పాఠక్ తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాన మంత్రి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడి అభివ్రుద్ధి పనులను స్థానిక ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. అయితే ఏకంగా వారు కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టడంతో ప్రజలు అవాక్కయ్యారు.
OLX पर शरारती तत्वों द्वारा पीएम के संसदीय कार्यालय को बेचने हेतु दिये गये विज्ञापन के सम्बन्ध में #SSP_VNS @amitpathak09 की बाईट @Uppolice @dgpup @adgzonevaranasi @IgRangeVaranasi @AmarUjalaNews @Live_Hindustan @TOIIndiaNews @htTweets pic.twitter.com/oXLwh34oyM
— Varanasi Police (@varanasipolice) December 18, 2020