
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 40 వేల లోపు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 391 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,57,029గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,43,019కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,56,546 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 93,57,464గా ఉంది. ఇక కాగా దేశంలో రికవరీ రేటు 94.93 శాతం కాగా.. మరణాల రేటు 1.45 ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 10,14,434 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎం ఆర్ తెలిపింది.