భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండగా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 20,021 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 279 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,47,901కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,77,301యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 97,82,669గా ఉంది. కాగా నిన్న ఒక్కరోజే 7,15,397 పరీక్షలు నిర్వహించగా మొత్తం ఇప్పటి వరకు 16,88,18,054 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎమ్మార్ ప్రకటించింది.