డిజిటల్ లావాదేవీల కోసం ఎక్కువగా ఉపయోగించే యాప్ లలో ఒకటైన గూగుల్ పే యాప్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై గూగుల్ పే ఏకంగా 500 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ తగ్గింపును పొందాలంటే గూగుల్ పే ద్వారా కనీసం 500 రూపాయల లావాదేవీ నిర్వహించాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ లపై గూగుల్ పే ఇచ్చిన డిస్కౌంట్ వల్ల యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది.
Also Read: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా.. ఈ తప్పు చేస్తే డబ్బులు కట్..?
గూగుల్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేయడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. 10 రూపాయల నుంచి 500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన తరువాత వచ్చే స్క్రాచ్ కార్డ్ ద్వారా ఈ డబ్బులను పొందవచ్చు. రోజురోజుకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ పే యాప్ ద్వారా సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ను పొందవచ్చు.
Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ కు ధీటుగా కొత్త స్లోగన్..!
గ్యాస్ కంపెనీలు గడిచిన నెల రోజుల్లో గ్యాస్ సిలిండర్లపై ధరను ఏకంగా 100 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. గ్యాస్ కంపెనీలు ఇకపై వారానికొకసారి సిలిండర్ ధరలలో మార్పులు చేయనున్నాయి. ఇలాంటి సమయంలో ఆఫర్లను వినియోగించి సిలిండర్లను బుకింగ్ చేసుకోవడం వల్ల కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. గూగుల్ పేతో పాటు ఇతర యాప్ లు కూడా కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తున్నాయి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
పేటీఎం యాప్ ను ఉపయోగించి డిసెంబర్ 31వ తేదీలోపు గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే 500 రూపాయల తగ్గింపును పొందవచ్చు. అయితే తొలిసారి గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ పొందవచ్చు. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ సహాయంతో గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకుంటే 30 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.