https://oktelugu.com/

కరోనా కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్.. ఆదేశంలో మూడోసారి లాక్డౌన్..!

కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఈ రెండు పదాలు వింటేనే ప్రపంచం బెంబెలేత్తిపోతోంది. కరోనా వైరస్ దాడి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ మానవాళికి పెను సవాల్ విసురుతోంది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడే లోపు కొత్త వైరస్ ప్రపంచాన్ని మరోసారి లాక్డౌన్ దిశగా నడిపిస్తోంది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ రెండు దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేసిన పలుదేశాలు ప్రయాణాలపై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 10:18 AM IST
    Follow us on

    కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ఈ రెండు పదాలు వింటేనే ప్రపంచం బెంబెలేత్తిపోతోంది. కరోనా వైరస్ దాడి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోక ముందే కరోనా కొత్త స్ట్రెయిన్ మానవాళికి పెను సవాల్ విసురుతోంది.

    కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందని సంబరపడే లోపు కొత్త వైరస్ ప్రపంచాన్ని మరోసారి లాక్డౌన్ దిశగా నడిపిస్తోంది. బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

    ఈ రెండు దేశాలకు విమాన సర్వీసులు నిలిపివేసిన పలుదేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు పలు దేశాల్లో నమోదవుతుండటంతో ఆయా దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి.

    ఇప్పటికే రెండుసార్లు లాక్డౌన్ అమలు చేసిన ఇజ్రాయిల్ తాజాగా మరోసారి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ప్రజలెవరూ కూడా వెయ్యి మీటర్ల దూరానికి మించి వెళ్లొద్దని స్పష్టం చేసింది.

    మొదటి.. రెండో లాక్డౌన్ ల కంటే మూడో లాక్డౌన్ ను ఇజ్రాయిల్ కఠినంగా అమలు చేస్తోంది. అయితే పాఠశాలలకు మాత్రం ఆ దేశం అనుమతి ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది.

    ఇజ్రాయిల్ ఇప్పటికే ఫైజర్ టీకాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 19నే ఫైజర్ టీకాను ఆ దేశ ప్రధాని నెతన్యాహు వేయించుకున్నారు. రాబోయే రెండు నెలలో దేశంలోని 22లక్షల మందికి టీకా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.