
మోదీ ప్రభుత్వం రూ.7,725 కోట్లతో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. ప్రధానికి అభినందనలు తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో 2.8 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్టు ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటల తుముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నొయిడాలోని మల్లీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ అండ్ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లకు కేంద్రం అనుమతి తెలిపింది. అనంతరం అమిత్‌షా మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు.