
కరోనా ఎంట్రీతో ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇప్పుడిప్పుడే ఈ రంగం తిరిగి కోలుకుంటోంది.
అంతర్జాతీయ విమానాలు గత కొద్దిరోజుల నుంచే తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనాతోడుగా ప్రస్తుతం కొత్త వైరస్ కేసులు విదేశాల్లో వెలుగు చూస్తుండటంతో అన్నిదేశాలు అప్రమత్తమవుతున్నాయి.
బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో ఈ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. భారత్ సైతం బ్రిటన్ దేశానికి వెళ్లే విమానాలపై డిసెంబర్ 31వరకు నిషేధం విధించింది.
ఆ తర్వాత దీనిని జనవరి 7కు దీనిని పొడగించింది. దేశంలోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదవుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈక్రమంలోనే అంతర్జాతీయ విమాన రాకపోకలపై బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 31వరకు అంతర్జాతీయ విమాన రాకపోకలపై డీజీసీఏ నిషేధం విధించింది.కరోనాకు వ్యాక్సిన్ రావడంతో విమాన రంగం తిరిగి కోలుకుంటుందని అందరూ భావించారు.
అయితే కొత్త కరోనా స్ట్రెయిన్ రూపంలో విమాన రంగానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ రంగం మరోసారి ఆర్థిక సంక్షోభంలో కురుకోవడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.