చిరుద్యోగుల తీర్థయాత్రల కోసం ఒక్కొక్కరికి రూ.12 వేలు

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వామి వివేకానంద ఇతిహాసిక్ పర్యటన్ యాత్రా యోజనను తీసుకొచ్చింది. ఈ నెల 24న యూపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలిలో నమోదు చేసుకున్న 1.5 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఉత్తరప్రదేశ్‌ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ సునీల్ భరాలా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, […]

Written By: Suresh, Updated On : January 1, 2021 2:02 pm
Follow us on

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వామి వివేకానంద ఇతిహాసిక్ పర్యటన్ యాత్రా యోజనను తీసుకొచ్చింది. ఈ నెల 24న యూపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలిలో నమోదు చేసుకున్న 1.5 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఉత్తరప్రదేశ్‌ కార్మిక సంక్షేమ మండలి చైర్మన్ సునీల్ భరాలా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, వర్క్ షాప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది (కార్మికులు, చిరుద్యోగులు) కోసం ప్రభుత్వం ఈ నూతన పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు.