https://oktelugu.com/

ఎన్టీఆర్ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్.. !

నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో పరిపూర్ణ నట రత్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇప్పటికే తారక్ ఫస్ట్ లుక్ వీడియో టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేసింది. విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా గొండు బెబ్బులి కొమరం భీంగా తారక్ అద్భుతంగా కనిపించడంతో, మొత్తానికి ఈ టీజర్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఈ టీజర్ తో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2021 / 02:01 PM IST
    Follow us on


    నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో పరిపూర్ణ నట రత్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇప్పటికే తారక్ ఫస్ట్ లుక్ వీడియో టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేసింది. విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా గొండు బెబ్బులి కొమరం భీంగా తారక్ అద్భుతంగా కనిపించడంతో, మొత్తానికి ఈ టీజర్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఈ టీజర్ తో తారక్ మొత్తానికి ఏ ఒక్క రికార్డును వదలకుండా వేటాడేసాడు.

    Also Read:  వీరత్వాన్ని మేల్కొలపాలంటున్న పవన్.. !

    ఇంకా వ్యూస్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ లను సెట్ చేయడానికి కొన్ని వ్యూస్ రీచ్ అవ్వాల్సి ఉన్నా.. మరికొన్ని రోజుల్లో అది కూడా బద్దలు కొట్టి.. మళ్ళీ మరో రికార్డ్ ను క్రియేట్ చేయనున్నాడు ఎన్టీఆర్. అయితే, ఇప్పటికే ఈ టీజర్ తో మన టాలీవుడ్ లో మొట్ట మొదట 1 మిలియన్ లైక్డ్ టీజర్ గా రికార్డ్ సృష్టించిన ఎన్టీఆర్.. ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి మొట్ట మొదటి 1 మిలియన్ కామెంట్స్ చేసిన టీజర్ గా కూడా తారక్ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తానికి తారక్ ఫ్యాన్స్ కు కొత్త సంవత్సరంలో ఈ రికార్డ్ సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

    Also Read: అప్పటి ముచ్చట్లు : ఎన్టీఆర్ లో వెంకటేశ్వర స్వామి కనిపించారట !

    ఇక ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ జనరేషన్ లో మొదటిసారి టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో.. మొదటినుండి ఈ సినిమా పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు అభిమానులు. ఎలాగూ రాజమౌళి విజువల్ సెన్స్ పై కామన్ ఆడియన్స్ కి కూడా అపారమైన నమ్మకం కలగడంతో నేషనల్ వైడ్ గా కూడా ఈ సినిమాకి ఫుల్ డిమాండ్ తో ఫుల్ క్రేజ్ కూడా బాగా క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్