https://oktelugu.com/

ఆకట్టుకుంటున్న ‘యానిమల్’ టైటిల్ టీజర్ !

అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్ లో, కబీర్ సింగ్ తో హిందీలో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు సందీప్ వంగ. ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడంతో, సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. అందుకే, తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‏తో చేయబోతున్నాడని.. న్యూఇయర్ కానుకగా జనవరి 1 మధ్యాహ్నం 12 గంటలకు ఈ కాంబినేషన్‏లో రాబోతున్న కొత్త సినిమా అప్ డేట్ రివీల్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2021 / 03:01 PM IST
    Follow us on


    అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్ లో, కబీర్ సింగ్ తో హిందీలో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు సందీప్ వంగ. ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడంతో, సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. అందుకే, తన కొత్త సినిమాని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‏తో చేయబోతున్నాడని.. న్యూఇయర్ కానుకగా జనవరి 1 మధ్యాహ్నం 12 గంటలకు ఈ కాంబినేషన్‏లో రాబోతున్న కొత్త సినిమా అప్ డేట్ రివీల్ అవ్వబోతుందని ఇప్పటికే కబీర్ సింగ్ నిర్మాత పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: ఎన్టీఆర్ ఖాతాలో మరో సరికొత్త రికార్డ్.. !

    కాగా తాజాగా ఊహించినట్లుగానే ఈ సినిమా టైటిల్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకి ‘యానిమల్’ అనే టైటిల్ పెట్టారు. ఇక టీజర్ లో కాస్టింగ్ వివరాల్ని కూడా వెల్లడించారు. సీనియర్ నటుడు అనీల్ కపూర్ – రణబీర్ కపూర్- బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. ఇందులో పరిణీతి చోప్రా కథానాయికగా నటించబోతుంది. ఇప్పటికే ప్రీ-లుక్ టీజర్ లో రణబీర్ కపూర్ వాయిస్ తో బ్యాక్ డ్రాప్ లో కథను కూడా వినిపించడంతో.. మొత్తానికి బాలీవుడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ను ఇచ్చింది.

    Also Read: వీరత్వాన్ని మేల్కొలపాలంటున్న పవన్.. !

    ఇంతకీ టైటిల్ టీజర్ లో చెప్పిన వాయిస్ ఓవర్ ఏమిటంటే.. ‘హీరో తన తండ్రిని తరువాతి జీవితంలో తన కొడుకుగా జన్మించమని .. ఆ తర్వాత మళ్ళీ తండ్రిగా జన్మించమని కూడా అడుగుతాడు;. వినడానికి చిన్న వన్ లైనర్ గా ఉన్న మాటతోనే ఎంతో ఇంప్రెస్ చేశాడు సందీప్. ఇక మునుపెన్నడూ రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నారని బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. 2021 కానుకగా ప్రకటించిన యానిమల్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ? అసలు కథాకమామీషు ఏమిటి? అనేది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్