
వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనపై కేంద్ర మంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో చాలా మంది రైతుల్లాగా కనిపించడం లేదని, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, రైతు కమిషన్ల సభ్యులే ఉన్నారని ఆయన అన్నారు. ఓవైపు ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు చేస్తుండగా మరోవైపు ప్రభుత్వంలోని పెద్దలు రైతుల నిరసనపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.