https://oktelugu.com/

విజయశాంతి దాచేస్తే దాగదుగా? ‘కాషాయ’ ప్రేమ సల్లగుండ?

‘మనసులో ఒకటి పెట్టుకొని.. పైకి ఒకటి మాట్లాడడం తెలంగాణలోళ్లకు సాధ్యం కాదు బై’ అని అంటుంటారు. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్. అస్సలు మోహమాటం లేదు. మన రాములమ్మకు అంతే.. తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతికి ఆవేశం వచ్చినా.. ప్రేమ వచ్చినా తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పతనంతో రగిలిపోతున్న రాములమ్మ బీజేపీలోకి జంప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. బీజేపీ పెద్దలు రాములమ్మ ఇంటికెళ్లి మరీ నెత్తిన పెట్టుకుంటామన్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2020 8:18 pm
    Follow us on

    ‘మనసులో ఒకటి పెట్టుకొని.. పైకి ఒకటి మాట్లాడడం తెలంగాణలోళ్లకు సాధ్యం కాదు బై’ అని అంటుంటారు. ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్. అస్సలు మోహమాటం లేదు. మన రాములమ్మకు అంతే.. తెలంగాణ ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతికి ఆవేశం వచ్చినా.. ప్రేమ వచ్చినా తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ పతనంతో రగిలిపోతున్న రాములమ్మ బీజేపీలోకి జంప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. బీజేపీ పెద్దలు రాములమ్మ ఇంటికెళ్లి మరీ నెత్తిన పెట్టుకుంటామన్నారు. కానీ ఎంతకు తేల్చదేం.. రాములమ్మకు కాషాయ పార్టీపై ప్రేమ ఉంది..కానీ అది బయటపడడం లేదు. పార్టీ మార్పుపై నోరు విప్పడం లేదు.

    Also Read: కొత్త వివాదం.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కూతురు దొంగ ఓటు వేశారా?

    ఇటీవలే విజయశాంతి బీజేపీలో చేరికకు చివరి ముహూర్తాన్ని కమలం పార్టీ అయ్యావారు పెట్టేసారని వార్తలు వచ్చాయి. అమిత్ షా ఆదివారం హైదరాబాద్ సందర్శించినప్పుడు విజయశాంతి బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. కాని అది జరగలేదు. ఇంకా స్పష్టత రాలేదు. బిజెపిలో చేరడానికి ఆమె ఇంకా వెనకడుగు వేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

    అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విజయశాంతి మంగళవారం ఓటు వేయడానికి వచ్చినప్పుడు అందరికీ షాకిచ్చారు విజయశాంతి తన ఓటు వేయడానికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటింగ్ తరువాత, ఆమె ఓటు వేసినట్టు సిరాతో ఉన్న తన చేతి వేలును కెమెరాకు చూపించారు. ఇక్కడే విజయశాంతి దొరికిపోయారు.

    Also Read: ఈ బామ్మను చూసైనా.. నగరవాసులు మెల్కొంటారా?

    విజయశాంతి వేలిని ఎవరూ చూడలేదు. ఆమె ముఖాన్ని చూశారు. ఆ ఫొటోలు వైరల్ చేశారు. విజయశాంతి తాజాగా కాషాయ రంగు మాస్క్ ధరించి ఓటు వేయడానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని ఆమెకు బీజేపీపై ప్రేమ చావడం లేదని అర్థమవుతోంది. ఆమె అతి త్వరలో బీజేపీలోకి చేరుతుందనే ప్రచారానికి సంకేతంగా విజయశాంతి ఇలా కనిపించింది కావచ్చు అని పలువురు చెవులు కొరుక్కున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్