జనవరి 31 వరకు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వైద్యులు, ఆరోగ్యశాఖ అధికారులు సెలవులు రద్దు చేశారు. డిసెంబర్, జనవరి 31 వరకు వైద్యారోగ్య సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 వరకు సెలవులు రద్దు చేయబడిన వారిలో నర్సులు, కాంట్రాక్టు కార్మికులు, రోజువారీ కూలీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న ద్రుష్ట్యా వీరి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మొదటి దశలో ఫ్రంట్ లైన్ […]

Written By: Suresh, Updated On : December 16, 2020 2:35 pm
Follow us on

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వైద్యులు, ఆరోగ్యశాఖ అధికారులు సెలవులు రద్దు చేశారు. డిసెంబర్, జనవరి 31 వరకు వైద్యారోగ్య సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31 వరకు సెలవులు రద్దు చేయబడిన వారిలో నర్సులు, కాంట్రాక్టు కార్మికులు, రోజువారీ కూలీ కార్మికులు ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న ద్రుష్ట్యా వీరి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మొదటి దశలో ఫ్రంట్ లైన్ కార్మికులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు ప్రైవేటుకు చెందిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గోరఖ్ పూర్ లో మొదటి దశ టీకాను 23,000 మందికి ఇవ్వనున్నట్లు ఆ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ తివారి తెలిపారు.